
పుట్టిన వాడు గిట్టక మానడు అనే మాట అందరికి తెల్సిందే. అయినప్పటికిని అనుకోకుండా ప్రమాదాలు జరిగి మన రాష్ట్రం ఎంతో మంది ప్రముఖ నాయకులను కోల్పోయింది. ఇందులో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే ఉన్నారు. ప్రమాదాల్లో చనిపోయిన జాతీయ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల నాయకుల గూర్చి చెబుతూ పోతే చాలా మంది ఉన్నారు. కాగా వివిధ ప్రమాదాల్లో చనిపోయిపటువంటి మన రాష్ట్ర నాయకులను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందా.
తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగి భువనగిరి నియోజక వర్గం నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పలు కీలక మంత్రి పదవులను చేపట్టిన మాజీ హోంశాఖ మంత్రి మాదవరెడ్డి 2000సంవత్సరంలో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు ఘట్ కెసర్ సమీపంలో అమర్చిన మందుపాతరకు బలయ్యారు. చనిపోయిన సందర్బంలో మాధవరెడ్డి కీలకమైనటువంటి పంచాయత్ రాజ్ శాఖ మంత్రి బాధ్యతలో ఉన్నాడు. హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో నక్సలైట్లపై ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల సందర్భంలో హోంశాఖమంత్రిగా ఉన్నందున అతను టార్గెట్ గా మారి మందుపాతరలో చనిపోయారు. కాగా తెలుగుదేశం పార్టీకి చెందిన మరో మంత్రి వెంకటరమణ ఇతను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నితంగా ఉండేవారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను పదవి నుండి దించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడంలో వెంకటరమణ ప్రముఖంగా వ్యవహరించారు. వెంకటరమణ ఆలేరు సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయారు. ఇక మరో నాయకుడు జిఎం బాలయోగి రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా పేరున్నటువంటి నాయకుడు. పార్లమెంటు స్పీకర్ గా కొనసాగుతున్నటువంటి జిఎం బాలయోగి తన స్వంత నియోజక వర్గంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పొందారు. తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకునిగా పేరుగాంచిన బాలయోగికి రాజకీయంగా ఎంతో భవిష్యత్తున్నప్పటికి హెలికాప్టర్ పైకిలేచే సమయంలో చెట్టుకు డీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి బాలయోగి ప్రమాదానికి గైరై చనిపోయారు. ఇక రాష్ట్ర ప్రజలు మరిచిపోలేనటువంటి నాయకుడు,ఇప్పటి వరకుఅందరిహృదయాల్లోబ్రతికే ఉన్నాడనిపించుకుంటున్నటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈయన దుర్మరణం రాష్ట్రానికి తీరని లోటుగా ఇప్పటికి కనిపిస్తూనే ఉంది. ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలపై ఆయన ముద్రను చెరిపివేసేందుకు కొంత మంది చేసినటువంటి కుట్రలు కూడా విఫలమవుతున్నాయి. దివంగత రాజశేఖర్ రెడ్డి తమవాడంటే తమవాడని కొన్ని పార్టీలు చెప్పడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆయనకు ప్రజాదరణ ఏవిధంగా ఉందో స్పష్టమవుతుంది. ఇక మరో ప్రముఖ నాయకుడు మాజీ హోంశాఖ మంత్రి ఇంద్రారెడ్డి ఆయన బ్రతికున్న కాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు, తెలంగాణ కోసం పార్టీని స్థాపించిన ఇంద్రారెడ్డి ఆయన ఆశయం నెరవేరకుండానే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్నటువంటి వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో చనిపోయారు. ఇలా నాటి మాదవరెడ్డి నుండి నేటి ఎర్రన్నాయుడి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో మంది ప్రముఖ నాయకులను కోల్పోయింది. అందుకే వారందరిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం....
No comments:
Post a Comment