Thursday, 29 November 2012

NITHESH IN WORLD TOP 100

నితీశ్ కు ప్రపంచ మేధావుల జాబితాలో 77వ స్థానం!

'మిస్టర్ క్లీన్' ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ని ప్రపంచం మిస్టర్ మేధావిగా గుర్తించింది. ప్రపంచ స్థాయిలోని 100 మంది మేధోసంపన్నుల జాబితాలో ఆయన చోటు సంపాదించుకున్నారు. అమెరికన్ మ్యాగజైన్ 'ఫారెన్ పాలసీ' 2012 సంవత్సరానికి ఎంపిక చేసిన మేధావుల్లో మన దేశం నుంచి వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీతో పాటు ఒక రాజకీయ నేత కూడా ఉండటం విశేషం. ఈ జాబితాలో రష్దీకి 33వ స్థానం, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కు 77 స్థానం కల్పించారు. వాక్ స్వాతంత్య్రం సాధన కోసం సుదృఢమైన కృషి చేసిన అరుదైన వ్యక్తులను ఈ పత్రిక ఏటా గుర్తించి గౌరవిస్తోంది. ఆటవిక రాజ్యంగా అచేతన రాష్ట్రంగానూ పేరుపడిన బీహార్ తలరాతను మార్చివేసిన నేతగా నితీశ్‌ను ఈ పత్రిక పొగడ్తలతో ముంచెత్తింది. 

No comments:

Post a Comment