Saturday, 3 November 2012

DAMARUKAM RELEASE DATE GOT CONFIRMED

9న డమరుకం విడుదల డమరుకం విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఈ నెల 9న డమరుకం సినిమా విడుదల అవుతుంది. గత కొన్ని రోజులుగా డమరుకం సినిమా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిద పడటం, సినిమా నిర్మాతలు అప్పుల్లో ఉన్నారని వార్తలు రావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే, తాజా  వార్తల ప్రకారం ఈ సినిమా ఈ నెల 9న విడుదల అవుతుంది. సినిమా విడుదలకు ఉన్న చిక్కులన్నీ తొలగిపోయాయని, ఈ నెల 9న సినిమా విడుదల ఖాయమని తెలుస్తుంది. నాగార్జున తొలిసారిగా నటించిన ఈ సోషియో ఫాంటసీ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. గ్రాఫిక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ గా చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందంచిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. 

No comments:

Post a Comment