వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచి ఓటు వేయనున్నారు. ఆమె తిరిగి రావడానికి వారం ముందు నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రోదసిలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచే ఆమె ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నవంబర్ 12న ఆమె అంతరిక్షం నుంచి భూమికి తిరిగిరానున్నారు. నవంబర్ 6న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కజకిస్థాన్‌లోని బైకొనుర్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం సునీతా విలియమ్స్ రెండోసారి అంతరిక్ష యానానికి బయలుదేరారు.
|
No comments:
Post a Comment