వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణువర్థన్ బాబు మంగళవారం ములాఖత్ సమయంలో కలుసుకున్నారు. అదే సమయంలో జగన్ తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. అయితే జగన్‌ను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని, కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలవల్లే కలిసినట్లు చెబుతున్నారు.
అయితే మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. జగన్‌ను కలవడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్న అన్ని పార్టీలను తొలుస్తోంది. గతంలో కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతి రెడ్డితో కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment