
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు కుమారుడు జలగం వెంకట్రావు జగన్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు జలగం చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ను కలిసి తన మనసులోని మాటను చెప్పారు. జగన్కు మనోధైర్యం చెప్పడంతో తాను దివంగత రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనీ అనుకుంటున్నట్లు జలగం వెంకట్రావు చెప్పుకొచ్చారు. దివంగత రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తమ కుటుంబానికి చాలా దగ్గరి సంబంధాలున్నాయనీ జలగం అంటున్నారు. దీనితోనే తాను కూడా జగన్ పార్టీలో చేరాలని అనుకుంటున్నాననీ, త్వరలోనే పార్టీలో అధికారికంగా చేరుతాననీ వెంకట్రావు తెలిపారు. జగన్ను అనకాపల్లి ఎంపీ సబ్బం హరి కూడా ములాఖత్ టైంలో కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై జగన్ తో సబ్బం చర్చించి ఉంటారనీ ప్రచారం జరుగుతోంది. అంతకు ముందు జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతిరెడ్డి కూడా జగన్ను కలిశారు.
No comments:
Post a Comment