తూర్పగోదావరి జిల్లా గోపాలపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తానేటి వనిత తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. మరికాసేపట్లో ఇందుకు సంబంధించిన వివరాలను అందించిందేకు మీడియా ముందుకు రానున్నారు. కాగా తాను రాజకీయంగా ఎదుగడం కోసం కృషిచేసినటువంటి నాయకులు ఒక్కరొక్కరుగా టిడిపినుండి వెళ్లిపోవడంతో తాను కూడా ఇక వారి బాటలో నడిచేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే గా 2009 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశంపార్టీ టిక్కెట్ పై గెలుపొందినటువంటి తానేటి వనిత తనకు టిక్కెట్ ఇప్పించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి అదే జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు , కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపిలో చేరేందుకు ఇప్పటికే సిద్దం కావడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులతో పార్టీకి రాజీనామా చేసేందుకు వనిత సిద్దమయ్యారు. రాజీనామా చేసిన అనంతరం రెండుమూడు రోజుల్లో వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకోనున్నారు.
No comments:
Post a Comment