
‘వందరోజుల సినిమాలను ఇక మనం మరిచిపోవాల్సిందే. ఈ రోజుల్లో ఒక సినిమా యాభైరోజులు ఆడటమే కష్టం. ఇక, వందరోజుల వరకూనా...’ - ఈ మాటలన్నది ఎవరో కాదు, హీరో నాగార్జున. నిజమే, ఈ విషయం చాలామందికి తెలుసు.
ఇందుకు కారణాలూ తెలుసు. ‘ఈరోజుల్లో అన్ని సినిమాలూ కొన్నివందల థియేటర్లలో విడుదలవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త సినిమాలు విడదలవుతున్నాయి. పల్లె నుంచి పట్నం వరకూ అందరూ సినిమాను విడుదలైన వెంటనే చూసే అవకాశం వచ్చింది. ఇక సినిమాలు ఎక్కువ రోజులు ఎలా ఆడతాయి’ అంటున్నారు నాగార్జున.
మరి, 50, 100 రోజులు ఆడాయని ఘనంగా చెప్పుకుంటున్నారు కదా అంటే... నాగ్ ఏమన్నారో తెలుసా... ‘ఎవరో పనిగట్టుకుని ఆడించుకోవాలి తప్ప అది సాధ్యమయ్యేది కాదు’ అని. అంటే, పెద్ద హీరోల ప్రోద్బలంతోనో, నిర్మాతల పట్టుదల వల్లో అలా ఆడిస్తున్నారని అనుకోవచ్చా నాగ్?
No comments:
Post a Comment