Monday, 9 July 2012

KODALI NANI TODAY UPDATES









అధికార పార్టీతో కుమ్మక్కైన టీడీపీ తీరును సొంత పార్టీ నాయకులే తప్పుపడుతున్నారు. ప్రజా ప్రయోజనాల్ని విస్మరించి, ప్రతిపక్ష బాధ్యతల్ని పక్కన పెట్టిన టీడీపీకి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాక్‌ ఇచ్చారు. చంద్రబాబు తీరుతో మనస్తాపానికి గురైన కొడాలి నాని పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో భేటీ అయ్యారు. 

దాంతో నానిపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు వేసింది. పార్టీ వ్యవహారాల్లో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంత కాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి టీడీపీ తరపున రెండుసార్లు నాని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లాలో దేవినేని ఉమా పెత్తనం కొనసాగుతోందని, ప్రొటోకాల్‌ ప్రకారం కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చంద్రబాబు దృష్టికి ఆయన చాలాసార్లు తీసుకువచ్చారు.


తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కృష్ణాజిల్లా నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్‌గూడ జైల్లో కలుసుకున్నారు. ఆయనతో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయవాడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వంగవీటి రాధ కూడా జగన్‌ను కలిసినవారిలో ఉన్నారు.


వ్యక్తిగతంగానే తాను చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్లు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన జగన్ ను కలిశారు. అనంతరం కొడాలి నాని విలేకర్లతో మాట్లాడుతూ తనపై టీడీపీ చేసిన విమర్శలకు త్వరలోనే సమాధానం చెబుతానన్నారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment