రాజకీయాల్లో జీవించమంటే... టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం నటిస్తానంటున్నారు. అందుకే టాలీవుడ్ డైరక్టర్ల వద్ద కోచింగ్ మొదలుపెట్టారు. జనాల్ని మాయ చేసే ట్రిక్కుల్ని నేర్పమంటూ బతిమాలుకుంటున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో జనాల్ని మెప్పించే డైరక్టర్ల వద్ద మ్యాజిక్‌లు నేర్చుకుని... జనాల్ని మనసుల్ని మార్చేసేందుకు తెగ ట్రైచేసేస్తున్నారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా సినిమాలో కథ లేకపోతే ఫట్ అన్న విషయం బాబుగారు మర్చిపోయినట్టున్నారు.
వరుస ఫ్లాప్‌లతో అల్లాడుతున్న హీరోలు... టాలెంట్ ఉన్న దర్శకులతో పనిచేసి హిట్ సాధించి తెగ గొప్పలు చెప్పుకుంటారు. రియల్‌లైఫ్‌లో మాత్రం ఎవరి సమస్యను వారే పరిష్కరించుకోవాలి. సినిమా స్క్రిప్ట్‌ను ఫాలో అయ్యే డైరక్టర్లను నమ్ముకుంటే ఉన్నది కాస్తా ఊడుతుంది. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిసినట్లుగా లేదు. ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అన్నివిధాలా ప
్రజల తిరస్కారానికి గురవుతున్న బాబు ప్లాప్ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రాజకీయ నిపుణుల సలహాలు స్వీకరించకుండా సినీ దర్శకులను ఆశ్రయించారు. వచ్చే నెల 2 నుంచి తాను నిర్వహించే 'జనచైతన్యం'లో ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో చెప్పాల్సిందిగా బాబు డైరెక్టర్లను కోరుతున్నారు. ప్రజలందరూ ఛీత్కరించుకునే ఈగను హీరోగా మలచి హిట్ సాధించిన రాజమౌళితో పాటు శ్రీను వైట్ల, తేజ తదితర సినీ దర్శకుల సలహాలు కోరారు.
డైరెక్టర్లతో భేటీ సమయంలో బాబుతో పాటు నటులు, పార్టీ నేతలు మాగంటి మురళీమోహన్, ఏవీఎస్‌లు కూడా ఉన్నారు. తాను పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ఎలా వెళితే బాగుంటుందో చెప్పాల్సిందిగా వారిని కోరారు. హావభావాలు ఎలా ఉండాలి, ప్రజల్లో ఎలా కలిసిపోవాలి, వారు తనను నమ్మే విధంగా ఎలా వ్యవహరించాలో చెప్పాలని చంద్రబాబు కోరారు. దీనికి స్పందించిన ఆ దర్శకులు.. ప్రజలపై దయ చూపుతున్నట్లుగా మెలగటంతో పాటు, వారు చెప్పింది శ్రద్ధగా ఆలకించాలని, ఒక నాయకుడిలా కాకుండా కుటుంబసభ్యునిలా కలిసిపోవాలని, ఈ చర్యల ద్వారా వారిలో ఒక నమ్మకాన్ని కలిగిస్తే ఫలితం ఉండవచ్చని వివరించారు.
చంద్రబాబు పాదయాత్రలో ఉపయోగించేందుకు సినీ గేయ రచయితలు సుద్దాల ఆశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం రాసిన ఆరు పాటలను వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో రికార్డింగ్ చేస్తున్నారు. తన 'యాక్షన్' కోసం సినీ డెరైక్టర్లను ఆశ్రయించిన బాబు.. సీనియర్ నటుడు, తన వియ్యంకుడు బాలకృష్ణ సూచనలు కోరడం మాత్రం మరిచిపోయారు.

No comments:
Post a Comment