వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి రంగం సిద్దం చేసుకున్నారు. నల్లొండ జిల్లా ఆలేరు, భువనగిరి, రామన్నపేట (ఇప్పుడు లేదు) నియోజకవర్గాలలో పట్టున్న ఆయన ఈ నెల 9న తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో వైఎస్ జగన్ సమర్ధవంతమయిన నేతగా ఎదుగుతారని అన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అందరూ లబ్ది పొందారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు మేలు చేశాయని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో మంత్రిగా చేసిన అనుభవం లేకపోవడంతో రాష్ట్రంలో పాలనా యంత్రాంగం స్తంభించిపోయిందని అన్నారు. బీసీలకు వంద సీట్లు కాదని, అసెంబ్లీలో 100 మందిని కూర్చోబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లాలో ప్రభావం చూపే ఉప్పునూతల కాంగ్రెస్ ను వీడడం పార్టీకి పెద్దలోటే.
No comments:
Post a Comment