Tuesday, 4 September 2012

లక్ష్మీరాయ్ కు లక్కీఛాన్స్

లక్ష్మీరాయ్ కు లక్కీఛాన్స్చాల సంవత్సరాల క్రితం శ్రీకాంత్ హీరోగా వచ్చిన కాంచనమాల కేబుల్ టివి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగమ్మ లక్ష్మీరాయ్. అప్పట్నుంచి ప్రయత్నిస్తున్నా లక్ష్మీరాయ్ కి ఇప్పటికీ సరైన బ్రేక్ దక్కలేదు. కాంచనమాల సినిమా హిట్టయినా క్రేజ్ మొత్తం లారెన్స్ కొట్టేశాడు. అలాగే, అదుకుంటాడనుకున్న ‘అధినాయకుడు’ నిరాశ పరిచాడు. అయితే లక్ష్మీరాయ్ కు తాజాగా ఓ లక్కీఛాన్స్ తగిలింది. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించే తాజా సినిమాలో హీరోయిన్ గా లక్ష్మీరాయ్ ఎంపిక అయింది. కోడి రామకృష్ణ ప్రతిభ గురించి సినిమా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్ శాతం అధికంగా ఉన్న శతాధిక చిత్రాల దర్శకుడు అతను. కోడి రామకృష్ణ సినిమాలు హిట్ అవ్వడమే కాకుండా అందులో హీరో హీరోయిన్లుకు మంచి పేరు తీసుకుని వస్తాయి. అప్పటి వరకూ సాధారణ హీరోయిన్ గా ఉన్న అనుష్క అరుంధతి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇలాంటి ఉదాహరణలు కోడి రామకృష్ణ కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. కాగా, కోడి రామకృష్ణ తాజాగా తీయబోయే సినిమాలో అర్జున్, సోనూసూద్, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలకు ఎంపిక అయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లో రూపొందించే ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని లక్ష్మీరాయ్ చాలా సంతోషంగా ఉంది.    

No comments:

Post a Comment