భయపెడుతున్న రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధ పడుతున్నాడు. అతను రూపొందించిన ‘భూత్ రిటర్న్స్’ సినిమా అక్టోబర్ 12న విడుదల కానుంది. 2003 వచ్చిన భూత్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
త్రీడిలో తెరకెక్కుతున్న భూత్ రిటర్న్స్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాతో ప్రేక్షకులు మరోసారి భయపడ్డం ఖాయమని రామ్ గోపాల్ వర్మ ధీమాగా ఉన్నాడు. ఈ భూత్ రిటర్న్స్ సినిమాలో జె.డి.చక్రవర్తి, మనీషా కొయిరాల, మధుశాలిని తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.
No comments:
Post a Comment