‘KHAN’S QUEST’ పేరిట బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు టైమ్ మ్యాగజైన్ అంతర్జాతీయ గౌరవం ఇచ్చింది.
ఆయన చిత్రాన్ని ముఖచిత్రంగా ముద్రించిన టైమ్ ఆయన పేరిట ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. టైం పత్రిక కవరేజ్ ను ప్రపంచంలో సెలబ్రిటీలంతా ఓ ప్రత్యేక గుర్తింపుగా భావిస్తారు. ఇప్పుడా గౌరవం మన అమీర్ ఖాన్ కి దక్కడం ఆయన అభిమానులను ఆనందపరుస్తోంది.

‘సత్యమేవ జయతే’ కార్యక్రమంతో సాంఘీక దురాచారాలు, అనవసర శస్త్రచికిత్సలు, వైద్యుల పనితీరు మీద అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న ఈ షో విజయవంతమయింది. దీనికి గుర్తింపుగానే ఈ టైమ్ ముఖచిత్ర కథనంగా భావిస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పటివరకు 1976 లో పర్వీన్ బాబీ, 2003 లో ఐశ్వర్యారాయ్ ముఖ చిత్రాలుగా ప్రచురించారు. హీరోలలో అమీర్ ఖాన్ మొదటివాడు. ఇక భారతీయులయిన మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల ఫోటోలు టైమ్ ముఖచిత్రాలుగా వచ్చాయి.
No comments:
Post a Comment