Saturday, 1 September 2012

‘‘ఆచార్య’’ గా మహేష్

‘‘ఆచార్య’’ గా మహేష్ 
మహేష్ బాబు త్వరలో ప్రేక్షకుల ముందుకు ‘ ఆచార్య’ పేరుతో రానున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మహేష్ నటిస్తున్న తాజా చిత్రానికి ఈ టైటిల్ పరిశీలనలో వుంది. సుకుమార్ దర్శకత్వంలో ‘‘ దూకుడు’’ చిత్ర నిర్మాతలు గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కోసం ఈ ‘ ఆచార్య’ అనే టైటిల్ ఖరారు చేసే ఉద్దేశంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో మహేష్ బాబు లెక్చరర్ గా నటిస్తున్నాడు అందువల్ల ఈ పేరు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నరు. గతంలో ఈ సినిమా కోసం ‘చంద్రుడు’, ‘ ఆగడు’ వంటి పేర్లు కూడా పరీశీలించినట్లు తెలిసింది. ‘బిజినెస్ మేన్’ తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ మహేష్ సరసన ఇందులో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే! 

No comments:

Post a Comment