Thursday, 5 July 2012

రాష్ట్రంలో ఉపాది పధకం ఇక 100 రోజులే




రాష్ట్రంలోని గ్రామీణప్రాంత ప్రజలకు  సరైన ఉపాధిఅవకాశాలు లేక పట్టణాలలోకి వలసలు వస్తుండడంతో కేంద్రప్రభుత్వంవారికి ఉపాధి హామి పధకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పధకం ప్రకారం గ్రామీణులకు  ఏడాదిలో వందరోజుల పాటు ఉపాధి హామికల్పించారు. అయితే ఇదివరలో మన రాష్ట్రప్రభుత్వం ఈ పధకాన్ని 200రోజులకు పెంచింది. బిసి లకు 200 రోజులు, యస్‌సి, యస్‌సిలకైతే సంవత్సరం పొడుగునా పనులు పొందవచ్చని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. కాని కేంద్ర గ్రామీణాభివృద్దిశాఖ 100రోజల పని దినాల్ని 200రోజులకు పొడిగించడాన్ని ఆక్షేపించింది. 

ఇది దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీయటమే అని వ్యాఖ్యానించింది. ఈనేపధ్యంలో ఉపాధిహామీపధకం సంచాలకులు ఎంపిడివోల సెల్‌ఫోన్లకు మెసేజ్‌ పంపారని తెలిసింది. గతంలో ఎన్‌ఆర్‌ఇజీఎస్‌  సిబ్బందికి 100 రోజుల పనిదినాలు ఉన్నట్లయితే పనిలోకి తీసుకోనక్కర్దేదని ఆదేశాలు ఉన్నాయన్నారు. 100 పనిదినాల మస్తర్‌ ఉంటే కంప్యూటర్‌ ఆ కుటుంబాల్లోని వ్యక్తుల వివరాలను నిరాకరిస్తుందని ఆయన తెలిపారు. జూలై 1 నుండే ఈ విధానం అమలులోకి వచ్చిందని  ఎంపిడివోలు అన్నారు. ఇకపై కొత్తగా ఉపాధిపధకాలకు వెళ్లాలనుకునే వారికి ఎంపిడివో కార్యాలయాలనుండే జాబ్‌కార్డు జారీ చేస్తారు. వివరాలకై స్ధానిక ఎంపిడివోలను కలవాలన్నారు.

No comments:

Post a Comment