Thursday, 5 July 2012

శెలవుపై వెళ్ళనున్న జె.డి. లక్షీనారాయణ ?










జగన్‌ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సి.బి.ఐ. జాయింట్‌  డైరెక్టర్‌  లక్షీనారాయణ త్వరలో శెలవుపై వెళ్ల వచ్చని తెలిసింది. నిజానికి ఆయన శిక్షణ నిమిత్తం కొంతకాలం బైట ప్రదేశానికి వెళ్ళ వచ్చని మొదట ప్రచారం జరిగింది. అయితే మారిన పరిస్దితులు, ఫోన్‌ కాల్స్‌ పై హైకోర్టు కామెంట్స్‌ నేపధ్యంలో ఆయన కొంతకాలం శెలవులపై వెళ్ళవచ్చన్న ప్రచారం జరుగుతోంది. 

జెడి కాల్‌ లిస్టును వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాక్షి ఛానల్‌ లో పదేపదే ప్రకటించే వరకు ప్రజలెవరికీ  లక్ష్మీనారాయణ ఐజిగా పదవిని అంతగా దుర్వినియోగం చేస్తున్నారన్న అవగాహన లేదనే చెప్పాలి. ఆసమయంలో మరో మహిళ వాసిరెడ్డి చంద్రబాల జెడి కాల్‌లిస్టులో ఉన్నారు. అదికూడా అంతగా పట్టించుకునే వారు కాదోమోగాని, ఆమె కాల్స్‌నుండి వైసిపి కి  బద్ద శత్రువైన మరో ఛానల్‌ అధిపతికి కాల్స్‌ వెళ్లటంతో సంచలనం అయింది. జెడి, ఆ ఛానల్‌ ఎదురు దాడికి దిగి హెచ్‌ఆర్సీకి చంద్రబాల ద్వారా కంప్లైంటు ఇవ్వడం మరో వివాదం అయింది. గుంటూరునుండి  భూషణ్‌ బి బవన్‌ అనే వ్యాపారి కాల్‌లిస్టును జనవరి 1, 2001 వరకు ఇవ్వవలసినదిగా కోర్టు కెక్కారు. దీనిని స్వీకరించిన ధర్మాసనం సోమవారం జెడి లక్ష్మీనారాయణ అంతసేపు మీడియాతో మాట్లాడవలసిన పనేమిటని చివాట్లు పెట్టింది.  వైసిపి నాయకుడు జగన్‌  ఏకపక్షంగా విచారణ చేపట్టారని, కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని  జెడి మీద మోపిన అభియోగాలకు సాక్ష్యం దొరికినట్లయింది. 

కొండ శిఖరం చేరుకోవటం కష్టమే కాని శిఖరం మీద స్థానాన్ని సుస్ధిరం చేసుకోవడం మరింత కష్టం. నిజాయితీకి, నిబద్దతకు పెట్టింది పేరన్నట్లుగా జనం హృదయాల్లో నిలచి పోవల్సిన అసాధారణ  ప్రజ్ఞా ప్రావిణ్యాలుగల ఐపియస్‌ ఆఫీసర్‌ ఇంతకు తెగించడం విచారకరం. వైయస్సార్‌ పార్టీ గౌరవ అధినేత విజయమ్మ జాయింట్‌డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ మీద ఇప్పటికే రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈవ్యవహారాన్ని  ప్రధానమంత్రికి బుధవారం వివరించామని విజయమ్మ చెప్పారు. తగిన సాక్ష్యాధారాలు కూడా అందచేశామని చెప్పారు. జగన్‌ ప్రాణానికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందనికూడా వారు తెలియచేశారు. ఈ కేసునుండి లక్ష్మీనారాయణను తప్పించాలని కోరారు. ఒక సీబిఐ అధికారిమీద ఇంత దారుణమైన ఆరోపణలు రావడం చరిత్రలో ప్రధమం. ఇది ఆయన వృత్తి జీవితానికి తీరని కళంకం.

No comments:

Post a Comment