జగన్ పై జరుగుతున్న అంతర్జాతీయ కుట్రను అర్థం చేసుకోవాలంటే ప్రపంచ రాజకీయం గురించి కాసింత తెలుసుకోవలసి ఉంది.
ప్రపంచ దేశాలన్ని ఒకప్పట్లో రెండు గ్రూపులుగా ఉండేవి. ఒక దానికి రష్యా ( నేడున్న తొక్కలో రష్యా కాదు. నాటి రష్యా -గార్బచేవ్ రాక ముందున్న రష్యా) మరొ దానికి అమెరికా అధ్యక్షత వహించేవి. మన నెహౄ పంచ శీల సిద్దాంతం – తఠస్త దేశాలని ఎన్ని కుప్పి గంతలు వేసినా మూడో కూటమి మన దేశంలోని థేర్డ్ ఫ్రంట్లాగే ఏడ్చింది.అమెరికా తన స్వప్రయోజనాలకోసం గ్రూపులు కడుతుంటే రష్యా అమెరికా బాధిత దేశాలకు బాసటగా నిలిచేది .
అమెరికా క్యేపిటలిజానికి -రష్యా కమ్యూనిజానికి కట్టుబడి ఉండేవి. అయినప్పటికి అమెరికా మాత్రం ఆదినుండి – ఎవరెమనుకున్నా నాకేంటి – నా స్వప్రయోజనాలే నాకు ముఖ్యం అంటూ బరితెహించి ప్రవర్తిస్తుండేది. ఐక్య రాజ్య సమితి, ప్రపంచ బ్యాంకులాంటి సంస్థలను సైతం తన స్వప్రయోజనాలకు వాడుకునేది.
మరీ వియత్నాం వంటి పాత విషయాలు మీలో చాలా మందికి గుర్తుండక పోవచ్చు కాని నిన్నా మొన్నా జరిగిన ఇరాక్ , ఆఫ్గానిస్తాన్ల పై దాడులు గుర్తుండొచ్చు. దురదృష్ఠ వశాస్తు నాటి రష్యా పతనం కావడంతో అమెరికాను కట్టిడి చేసే నాథుడే లేక పోయాడు.
అమెరికా అజెండా ఒకటే ప్రపంచంలో తనకు ఎదురుండ కూడదు. ఒక వేళ ఎవడన్నా గళం విప్పినా – అడ్డు చెప్పినా వాడ్ని/ఆ దేశాన్ని ఏకాకి చెయ్యాలి. మరే దేశమైనా ఆ దేశానికి మద్దత్తు పలక కూడదు. పొరభాటుగా అలా ఎవరన్నా -ఏ దేశమన్నా వత్తాసు పలికితే దానిని సైతం ఏకాకి చెయ్యడమే అమెరికా ఏక్ సూత్ర ప్రణాళిక.
నెహౄ హయాంలో మన దేశం థేర్డ్ ఫ్రంట్లో ఉన్నప్పటికి ఇందిర హయాంలో క్రమేణా రష్యా గూటికి చేరింది భారత్. రష్యా పతనం తరువాత క్రమేణా అమెరికా గుప్పెట్లోకి వెళ్ళి పోయింది. మన అణు ఒప్పందం ఒకటి చాలు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి.
అమెరికా తన స్వప్రయోజనం కోసం చేసే ఏక పక్ష నిర్ణయాలకు ఇదేమిటని ప్రశ్నించకుండా మద్దత్తు పలకాలంటే ఒకటి ఆ దేశం బలహీన పడి ఉండాలి. లేదా ఆ దేశాధినేత వెన్నెముక లేని వాడై ఉండాలి. ఇరాన్ వంటి చిన్న దేశం అమెరికా ఆగడాలను ప్రశ్నిస్తుంటే -భారత్ వంటి దేశం నోరు విప్పక పోవడానికి కారణం ఇక్కడి దేశాధినేత వెన్నెముక లేని వాడు. అతన్ని తెరవెనుకనుండి ఆడించే సోనియా అండ్ కో వారికి ప్రజల్లో మద్దత్తు లేదు.
కేవలం కొద్దో గొప్పో ప్రజా మద్దత్తు ఉన్న నాయకులకు ( మాయావతి/ములాయం/లల్లు) సి.బి.ఐ బూచి చూపి వారిని యు.పి.ఏ పేరిట కూడ కట్టుకుని కాలం వెళ్ళదీస్తున్నారు.
తమిళ నాడులో కరుణానిధి వంటి రాజకీయ అతిరథుడు సైతం -ఇటివల యు.పిలో చరితాత్మక విజయాన్ని
కైవశం చేసుకున్న ములాయం సైతం సి.బి.ఐ అంటే చాలు వారి పంచలు తడిసి పోతున్నాయి. అంతటి అద్వాని సైతం హవాలా కేసులో ఇరుక్కుని “సర్దుబాటు ” చేసుకున్నారు. కాని దేశ రాజకీయ చరిత్రలో సి.బి.ఐ బూచికి బెదరని ఏకైక నేతగా జగన్ అమెరికా దృష్థిలో పడ్డారు.
కైవశం చేసుకున్న ములాయం సైతం సి.బి.ఐ అంటే చాలు వారి పంచలు తడిసి పోతున్నాయి. అంతటి అద్వాని సైతం హవాలా కేసులో ఇరుక్కుని “సర్దుబాటు ” చేసుకున్నారు. కాని దేశ రాజకీయ చరిత్రలో సి.బి.ఐ బూచికి బెదరని ఏకైక నేతగా జగన్ అమెరికా దృష్థిలో పడ్డారు.
జగన్ తండ్రి వై.ఎస్. ఆర్ అమెరికా జేబు సంస్థైన ప్రపంచ బ్యాంకు సూచనలకు వ్యతిరేకంగా ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను కొనసాగించారు. చంద్రబాబు విదేశి సంస్థలకు భూములు కట్తపెడితే వై.ఎస్.ఆరేమో స్వదేశీ పెట్టుబడిదార్లకే అవకాశం కల్పించారు, ఇవన్ని అమెరికా దేశానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికి వై.ఎస్. సోనియా ఆదీనంలో ఉన్నారని సర్దుకుంది.
కాని జగన్ విషయానికొస్తే జగన్ సోనియా పై తిరుగు భాటు చేసి – సి.బి.ఐ ఆగడాలకు ఎదురీదితున్నారు. ప్రజల్లో ఎనలేని మద్దత్తును కూడ కట్టుకుంటున్నారు.
రేపు పార్లెమెంటుకు మద్యంతర ఎన్నికలొస్తే అత్యధిక పార్లెమెంటు స్థానాలను కైవశం చేసుకోవడం ఖాయం. తను మాత్రమే తన పార్టికి ఏకైక ఎం.పిగా ఉండగానే జాతీయ నాయకులతో “సత్సంభంధాలు” కలిగి ఉన్న జగన్ 30+ పార్లెమెంటు స్థానాలు కైవశం చేసుకుంటే చక్రం తిప్పడం ఖాయం.
ఆ పరిస్థితే వస్తే మన్మోహన్ వంటి బలహీన నేత – పి.ఎం అయ్యే అవకాశమే లేదు. అమెరికా తానా అంటే తందానా అనే వారు ఉండక పోవచ్చు.
ప్రస్తుతం భారత్ యొక్క ఆర్థిక విదానాన్నే కాదు చివరికి విదేశి విదానాలను సైతం ఖరారు చేసే అమెరికా భారత్ పై పట్టు కోల్ఫోతుంది.
ఈ స్థితి గతులను చూస్తుంటే జగన్ పై జరుతున్న కుట్రలకు కేవలం సోనియా మాత్రమే కారకురాలు కారేమో? సోనియా పై అంతర్జాతీయ వత్తిళ్ళున్నాయేమో అనిపిస్తుంది.
ఏది ఏమైనప్పటికి కారు మబ్బులను చీలుచుకుని ఉద్య భానుడు భయిటపడినట్టుగా జగన్ సి.బి.ఐ కుట్రలను చీల్చి చెండాడి భయిట పడటం ఖాయం. రాష్ఠ్ర్రంలోనే కాక కేంద్రంలో సైతం స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వాలు ఏర్పాటు కావడం తధ్యం.
No comments:
Post a Comment