మత్స్యకారుల సమస్యలను శాసనసభలో ప్రస్తావిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పదిహేను రోజుల్లోగా తిక్కవానిపాలెం మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూడాలని ఎన్‌టీపీసీ యాజమాన్యాన్ని విజయమ్మ డిమాండ్ చేశారు. ఎన్‌టీపీసీ వల్ల బాధితులైన మత్స్యకారులను పరామర్శించేందుకు విజయమ్మ, షర్మిల ఈరోజు ఉదయం విశాఖ జిల్లాలోని తిక్కవానిపాలెం వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఎన్‌టీపీసీ వల్ల మత్స్యకారులు బాధితులుగా మారారని, వారికి న్యాయం అందించేందుకు యాజమాన్యం సత్వరం చర్యలు చేపట్టాలని కోరారు. తిక్కవానిపాలెం బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. వారి తరఫున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. బాధితులందరికీ ప్రభుత్వం ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. మత్య్సకార కుటుంబాలను ఆమె పరామర్శించారు. మత్స్యకారులు విజయమ్మకు వినతి పత్రాన్ని సమర్పించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల పక్షాన నిలుస్తుందని విజయమ్మ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.
Sunday, 1 July 2012
మత్స్యకారులకు విజయమ్మ, షర్మిల పరామర్శ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment