ప్రస్తుతం నాగచైతన్య...దేవకట్టా దర్సకత్వంలో రూపొందుతున్న ఆటో నగర్ సూర్య లో రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్ధానం చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు దేవకట్టా కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి.నిర్మాత సైతం ఈ చిత్రంపై మంచి కాన్పిడెన్స్ గా ఉన్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ అవుతోంది.
మరో ప్రక్క నాగచైతన్య,సునీల్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనుంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో హిట్టైన ‘వెట్టై'చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. యు.టీవి వారి వద్దనుంచి బెల్లంకొండ రైట్స్ తీసుకున్నారు. మాధవన్, ఆర్య, సమీరారెడ్డి, అమల పాల్ ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన ‘వెట్టై' మంచి విజయం సాధించింది. తెలుగు వెర్షన్ కి దర్శకుడుగా డాలీని ఎన్నుకున్నారు. కొంచెం ఇష్టం..కొంచెం కష్టం చిత్రంతో దర్శకుడుగా మారిన డాలికి ఇది రెండో చిత్రం. జూన్ 26నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. నాగచైతన్య ...తమ్ముడుగా కీ క్యారెక్టర్ ని చేస్తూండగా,సునీల్ ..సెకండ్ హీరో పాత్రను చేస్తున్నారు.
అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య... ఈ ముగ్గురు హీరోలుగా ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాకి 'త్రయం' అనే పేరును పరిశీలిస్తున్నారు. వాల్ట్‌డిస్నీ, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తారు. ఈయన ఇటీవల విడుదలైన 'ఇష్క్' చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల కథానాయకుల్ని ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు.పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం సమకూరుస్తారు.

No comments:
Post a Comment