
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బృందావనం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి కాంబినేషన్లో త్వరలో ఓ చిత్రం రాబోతోంది. మధ్య మహేష్ బాబు హీరోగా 'బిజినెస్ మేన్' చిత్రాన్ని నిర్మించి, సూపర్ హిట్ కొట్టిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
వంశీ పైడిపల్లి ఇటీవల మహేష్ బాబును కలిసి స్టోరీ వివరించాడని, వంశీ చెప్పిన కథకు మహేష్ బాబు బాగా ఇప్రెస్ అయి, స్ర్కిప్టును మరింత డెవల్ చేయాలని సూచించాడని తెలుస్తోంది. వంశీ చిత్రాన్ని రొమాంటిక్ అండ్ యాక్షన్‌ఎంటర్ టైనర్‌గా ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ జనాలు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీకి కమిట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక వంశీ పైడిపల్లి ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ‘ఎవడు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత, అమీజాక్సన్ రొమాన్స్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా ఉండనుంది.
No comments:
Post a Comment