Wednesday, 4 July 2012

చంచల్‌గుడా జైలు వద్ద బాలుడి 'జై జగన్'


Boy Shouts Jai Jagan At Chanchalguda Jail
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చంచల్‌గుడా జైలు నుంచి బయటకు వచ్చి సిబిఐ కార్యాలయానికి బయలుదేరే ముందు ఓ పదేళ్ల బాలుడు జై జగన్ అంటూ స్లోగన్ ఇచ్చాడు. ఇది వైయస్ జగన్‌ను ఆశ్చర్యానికి గురి కాగా, పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. అది విన్న జగన్ తనదైన శైలిలో ఆ బాలుడివైపు తిరిగి దీవిస్తున్నట్లుగా చేయి ఊపి, ఓ నవ్వు పారేశారు.
జైలులో ఉన్న వారి ములాఖత్ కోసం ఆ బాలుడు తన కుటుంబ సభ్యులతో వచ్చాడు. జగన్ చూడగానే జైలు గేటుగా ఎదురుగా రోడ్డుకు అడ్డంగా నిలబడి అకస్మాత్తుగా జై జగన్ అంటూ నినదించాడు. సిబిఐ కార్యాలయానికి బయలుదేరుతూ జగన్ వాహనం ఎక్కే సమయంలో ఆ బాలుడు ఆ విధంగా చేశాడు. జగన్ ఆ సమయంలో తనదైన రీతిలో మీడియా ప్రతినిధులకు నమస్తే చెప్పి నవ్వారు. బాలుడి నినాదానికి వెనుదిరిగి తన దీవెనలు అందించారు.
ఆ నినాదంతో అప్రమత్తమై పోలీసులు అటు వైపు చూసి, ఆ నినాదం చేసింది ఓ బాలుడని గ్రహించి నవ్వుకున్నారు. జగన్‌ను అరెస్టు చేసి, తొలి రోజు జైలుకు తీసుకుని వచ్చినప్పుడు ఇద్దరు జగన్ అనుచరులు గొడవ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు వారిద్దరిని పోలీసులు వాహనంలో ఎక్కించుని దూరంగా వదిలేశారు. ఆ మర్నాడు జగన్‌కు అనుకూలంగా ఓ మహిళ న్యూస్ క్లిప్పింగ్స్ పంపిణీ చేసే ప్రయత్నం చేసింది. ఆమెను కూడా పోలీసులు పంపించివేశారు

No comments:

Post a Comment