Monday, 31 December 2012

Another hero daughter tollywood entry


varalakshmi_f
        తెలుగు తెర అంటే చాలా మంది సుందరాంగులకు మక్కువ ఎక్కువ. దక్షిణాది తారలంతా ఒక్కసారైనా  టాలీవుడ్‌ వెండితెరపై మెరిసిపోవాలని ఆశిస్తారు. ఆదిశగా ప్రయత్నాలు జరుపుతారుకూడా. ఇదే కోవలో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టాలని ఎదురుచూస్తోంది తమిళ హీరో శరత్ కుమార్ తనయి వరలక్ష్మి. ఇప్పుడామెకల నిజంకాబోతోంది. ఇటీవల తమిళంలో వచ్చిన 'మానం కోతి పరవై' అనే చిత్రం తెలుగు రీమేక్‌లో వరలక్ష్మి కథానాయికగా ఎంపికైంది.
        ఎజిల్‌ దర్శకత్వంలో హాస్యభరితంగా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులోకి రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా వరలక్ష్మి అయితే సరిగ్గా సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశారు.
          కాగా,  'పోడా పోడి' సినిమాలో శింబు పక్కన కథానాయికగా నటించి, సినీ జీవితాన్ని ప్రారంభించిన వరలక్ష్మి ఇక మీదట తెలుగు సినీ రంగం మీద ఎక్కువ ద్రుష్టి పెడతానంటోంది. 

No comments:

Post a Comment