
పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు... కానీ సినీ తారల పెళ్ళిళ్ళు తమకుతామే నిర్ణయించుకొని, మూణ్ణాళ్ళు గడవక ముందే.... పెళ్ళి పెటాకులు చేసుకుంటున్నారు. ఇటీవల సినీతారల్లో ఇవి బాగా పెరిగిపోయాయి. ఎంత అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారో అంత సైలెంట్ గా విడాకులు తీసుకుంటున్నారు. ఇక గత ఏడాది నవంబర్‌లో చిన్ననాటి స్నేహతుడు పద్మనాభన్ ని ఆమె వివాహం చేసుకుంది. 12.12.12 రోజులు విడాలకు అప్లై చేసిన మమతా మోహన్ దీనికి గల కారణాలు ఇటీవలే వెల్లడించింది. ప్రజీత్‌కున్న మద్యపాన వ్యసనమే తమ విడాకులకు కారణమని మమతా చెబుతోంది. ఎన్నిసార్లు చెప్పినా తాగుడు మానలేదనీ అందుకే అతనితో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డానని తెలిపింది. జీత్ దుబాయ్ బ్యాంక్‌లో ఉన్నతోద్యోగి. ఈ మధ్య ట్విట్టర్ లో ఈ భామ ఓ టీవీ ప్రోగ్రామ్ ని తన జీవితానికి ఉదహారణగా కూడా చెప్పింది. సుమలత చేస్తున్న టీవీ ప్రోగ్రామ్‌ను ఓసారి చూశాను. కామన్‌మేన్‌తో జీవితపు బండి అనే ప్రోగ్రామ్‌లో అక్కడ కుటుంబాల మధ్య కలతలు, అపోహలు వస్తుంటాయి. నా జీవితం కూడా అలాగే తయారైందని చెప్పడం విశేషం. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.
No comments:
Post a Comment