Monday, 31 December 2012

NO ONE WILL RAPE ME : PRIYANKA


delhi gang-rape case: priyanka chopra maintains that bollywood
నేను నగ్నంగా రోడ్డు మీద నడిచి వెళ్లిన  సరే.. నన్ను రేప్ చేసే హక్కు  ఏ మగాడికీ లేదని  బాలీవుడ్  హీరోయిన్  ప్రియాంక చోప్రా ప్రకటన చేసింది.  ఢిలీ రేప్  ఉదంతం  దేశం మొత్తాన్ని కదిలించింది.  చిన్నా పెద్ద , ఆడా మగా, అందరు దీని పై స్పందిస్తున్నారు. కొంత మంది విమర్శులు చేస్తున్నారు. మరికొందరు  తీవ్రంగా ఖండిస్తున్నారు.   ఈ సంఘటనను  బాలీవుడ్  నటి  ప్రియాంక చోప్రా తీవ్రంగా ఖండించింది.  ఒక అమ్మాయిని రేప్ చేసే హక్కు  ఏ మగాడికీ లేదు అంటూ  నిప్పులు  చెరిగారు.  రేప్ చేయడమనేది  మగాడి మైండ్  సెట్  మీద ఆధారపడి  ఉంటుంది  తప్ప,  తనకలా  జరగాలని  ఏ అమ్మాయి  కోరుకోదు అని అన్నారు.  ఇంట్లో  తల్లులందరూ  తమ కొడుకులకు   స్త్రీలను  గౌరవించడం నేర్పాలని, ఆమె సూచించారు. అంతేకాకుండా ఆడపిల్లలు  కూడా బయటికి  వెళ్లినప్పుడు  రక్షణ కోసం ఏమైన  వెంట ఉంచుకోవడం మంచిదని  ప్రియాంక  సలహా ఇచ్చింది.  బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది  ప్రియాంక మాటలకు మద్దతు పలికినట్లు తెలుస్తోంది.  బాలీవుడ్ నటి ప్రియాంక  చోప్రా ఇలా మాట్లాడటంపై మహిళలు, విద్యార్థులు, అమ్మాయిలు  అభినందిస్తున్నారని  బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

No comments:

Post a Comment