Saturday, 30 June 2012

aha... emi nithikatha!!!!!!!!!!!


నైతికంగా దెబ్బతీస్తున్నారన్న సీబీఐ జేడీ ఫిర్యాదుపై సర్వత్రా విస్మయం
ఓ వర్గం మీడియాకు కావాల్సిన లీకులివ్వటం నిజం కాదా?
వీలైనంత విషం కక్కేలా వాళ్లని ప్రోత్సహించటం అబద్ధమా?
ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది?
ఈ తీరు వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు బాధపడ్డాయో తెలుసా?
లిస్టెడ్ కంపెనీల ఇన్వెస్టర్లు కూడా దెబ్బతిన్నారని మీకు తెలియదా?
వాళ్లకు వ్యక్తిగత స్వేచ్ఛలు లేవా? వాళ్లవి ప్రైవేటు జీవితాలు కావా?
ఎమ్మార్ కేసులో అసలు కుట్రదారు బాబునెందుకు విచారించరు?
ఐఎంజీ దర్యాప్తునకు తగినంత సిబ్బంది లేరని చెప్పటం నిజమేగా!
వైఎస్ దుర్మరణం కేసు దర్యాప్తును మూడు నెలల్లోనే ముగించారేం?
ఎన్నికల ముందు జగన్ అరెస్టు.. ప్రచారాన్ని అడ్డుకోవటానికి కాదా?
అరెస్టు అధికార, విపక్షాలకు లబ్ధి చేకూర్చడానికే అన్నది నిజం కాదా?
ఇవి నైతికతకు సంబంధించిన ప్రశ్నలు కావా? ఎవరిది అనైతికత?

కాల్ డేటా వివరాలు లీకయ్యాయంటూ సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తనను నైతికంగా దెబ్బతీయటానికే ఇదంతా చేస్తున్నారని పేర్కొనటం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. రాజ్యాంగం తనకు కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దెబ్బ తీస్తున్నారని, కపటంతో దర్యాప్తును ప్రభావితం చేయటానికి కుట్ర చేస్తున్నారని ఆయన పేర్కొన్నట్టుగా గురువారం ‘ఈనాడు’ పత్రిక పతాక స్థాయి కథనాన్ని ప్రచురించింది. కీలకమైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న తనను.. నైతికంగా దెబ్బ తీయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా అందులో జేడీ పేర్కొన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తు తీరుతెన్నులపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం కావటం.. ఓ వర్గం మీడియా సాయంతో ైవె ఎస్సార్ కుటుంబాన్ని, అభిమానుల్ని, ‘సాక్షి’ని లక్ష్మీనారాయణ టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజా ఆరోపణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ఎవరిదండీ అనైతికం? జగన్‌ను దోషిగా నిరూపించాలని సీబీఐ ముందే నిర్ణయం తీసేసుకుని.. దాన్ని అమలు చేయటానికి నిబంధనల్ని గాలికొదిలేసి.. ఓ వర్గం మీడియాకు తాను చెప్పాలనుకున్నది చెబుతూ.. వీలైనంత విషం కక్కేలా వాళ్లని ప్రోత్సహిస్తూ దురుద్దేశపూరితంగా వార్తలు రాయించటం నిజం కాదా? ఇదంతా ఒక వ్యక్తిని అప్రతిష్టపాలు చేయటానికి పన్నిన లోతైన కుట్ర కాదా? విచారణలో భాగంగా ఒక గదిలో ఇద్దరు మాట్లాడిన అంశాలు కూడా బయటకు యథాతథంగా రాలేదా? జగన్‌ను, ఆయన కుటుంబీకుల్ని, బంధుమిత్రుల్ని, అభిమానుల్ని మానసికంగా దారుణంగా దెబ్బతీసేలా ఆ వర్గం మీడియాలో కథనాలు రాలేదా? సీబీఐ చెప్పిందంటూ వాళ్లు రాసిన కథనాల్ని లక్ష్మీనారాయణ సహా ఏ ఒక్క అధికారీ ఎందుకు ఖండించలేదు? ఏం! ఢిల్లీ పోలీసులు సైతం తమకు సంబంధించిన వార్తేదైనా వెలువడితే అది నిజమో కాదో వివరణ ఇస్తున్నారుగా! కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థకు ఆ మాత్రం బాధ్యత లేదా? పెపైచ్చు సదరు మీడియా ప్రతినిధులకు లక్ష్మీనారాయణ ఫోన్లు చేయటం నిజం కాదా? కీలకమైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్నానంటున్న అధికారికి అంత సమయం ఎక్కడుంది? మీడియాకు తనంతట తాను అన్నేసిసార్లు ఫోన్లు చేసి మరీ విషయాల్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇలా చేయడం ద్వారా కొన్ని లక్షల మందిని మానసికంగా దెబ్బ తీయటం అబద్ధమా? ఈ అడ్డగోలు కథనాల వల్ల జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల తాలూకు లిస్టెడ్ కంపెనీలు కూడా తీవ్రంగా దెబ్బ తినలేదా? వాటిలో పెట్టుబడులు పెట్టిన చిన్న చిన్న ఇన్వెస్టర్ల మాటేమిటి? ఇవేవీ లక్ష్మీనారాయణకు క నిపించలేదా? ఏం! వారికి రాజ్యాంగం వర్తించదనుకుంటున్నారా? స్వేచ్ఛగా బతికే హక్కు వారికి మాత్రం లేదా? మీ దర్యాప్తు మీరు చేయకుండా మీడియానెందుకు ఆశ్రయిస్తున్నారు?’’ అని కేసు పూర్వాపరాలను తొలి నుంచీ గమనిస్తూ వస్తున్న పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

No comments:

Post a Comment