యువనాయకులంతా వైసిపి వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి చంచల్‌గూడా జైలులో జగన్ ను కలసిన రాజకీయ నాయకుల్లో అత్యధికులు యువనాయకులే కావడం విశేషం. అసదుద్దీన్ ఒవైసీ, జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మేల్యే పినిపే విశ్వరూప్ తో పాటు అనేక మంది చంచల్‌గూడా జైలులో ములాఖత్ తీసుకుని జగన్‌ను కలిశారు. కాంగ్రెస్ పరిస్థితి దీనికి భిన్నంగా భిన్నంగా ఉంది. యువనాయకులంతా వైసిపి లోకి వెళతానికి ఆసక్తిచూపుతుంటే సీనియర్లంతా తమ భవిష్యత్ ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు తెలంగాణా అనుకూలవాదం వ్యతిరేక వాదాలతో ఆ పార్టీ సతమతమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ సంగతి చూస్తే ఆ పార్టీనాయకులు కూడా దిక్కు తోచని స్ధితిలో ఉన్నారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడ కాలికి బలపం కట్టుకు తిరిగినా ఆయాసం, నీరసం తప్ప ఏం మిగలలేదు. తెలంగాణ ప్రకటిస్తే ఓట్లు పడతాయని తెలంగాణనాయకులు , సమైఖ్యాంద్రకే కట్టు బడాలన్న ఆంధ్రనాయకులు చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పార్టీ నుంచి వలసల్ని నివారించడానికి ఆయన ఎంతగానో శ్రమపడాల్సి వస్తోంది. పార్టీలో నూతనోత్తేజం కల్పించడానికి, తనకు చేదోడువాదోడుగా ఉంటాడనే ఉద్దేశ్యంతో ఆయన తన తనయుడు నారా లోకేష్‌బాబును రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నారు.
No comments:
Post a Comment