Saturday, 30 June 2012

కేసేదైనా టార్గెట్ వైఎస్ కుటుంబమే!

కేసేదైనా టార్గెట్ వైఎస్ కుటుంబమే!



 

నిజానికి నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తూ ఏ కేసునైనా ఒకేలా చూడాల్సిన సీబీఐ.. చంద్రబాబుకు మాత్రం ప్రాణ స్నేహితుడిలా ప్రవర్తిస్తోందని గతంలోనే విమర్శలొచ్చాయి. ఎందుకంటే జగన్ కేసుల్లో క్షణం కూడా వృథా కాకూడదన్నట్లుగా రెండు వారాల్లోనే కోర్టుకు నివేదిక ఇవ్వటం.. కోర్టు దర్యాప్తుకు ఆదేశించిన గంటల వ్యవధిలో మూకుమ్మడి దాడులతో ఇన్వెస్టర్లను, వైఎస్సార్ కుటుంబీకుల్ని భయభ్రాంతుల్ని చేయటం తెలిసిందే. ఆఖరికి ఎమ్మార్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తూ కూడా జగన్ సన్నిహితులనే టార్గెట్ చేశారు తప్ప.. నిబంధనల్ని గాలికొదిలేసి టెండర్ల దశ నుంచే కుట్రపూరితంగా వ్యవహరించిన చంద్రబాబును మాత్రం విచారించనేలేదు. చివరకు సింగిల్ టెండర్ మిగిలేలా చక్రం తిప్పి.. హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా రూ.4 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.28 లక్షల చొప్పున సీఎం హోదాలో బాబు విక్రయించేశారు. అది కూడా ఏ పరిశ్రమకో, వేల మందికి ఉపాధి కల్పించటానికో కాదు.. విల్లాలు కట్టుకొని అమ్ముకోవటానికి! అయినా సరే.. ఈ వ్యవహారంలో 2004 కన్నా ముందు ఏం జరిగిందనేది తమకు అనవసరమన్నట్టుగా సీబీఐ మొండిగా వ్యవహరించింది. చివరికి సుప్రీంకోర్టు చెప్పినా సరే, అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ బాగోతాన్ని ప్రస్తావిస్తున్న వర్గాలు.. మరి ఇదెంత వరకూ నైతికమని గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి. పెపైచ్చు బాబు హయాంలో జరిగిన వ్యవహారాల్ని తప్పుబడుతూ, వాటిపై విచారణ జరపాలంటూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చినప్పుడు.. దానిపై మీనమేషాలు లెక్కిస్తూ మూడు వారాల దాకా సీబీఐ ముందుకు కదలకపోవడాన్ని, కనీసం అటువైపు దృష్టి కూడా సారించకపోవడాన్ని ఆ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

No comments:

Post a Comment