.png)
రాష్ట్రంలోని పాలక కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల వైఫల్యాల అనంతరం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ హైకమాండును కలిసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల ఫలితాల నివేదికను వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి , రాష్ట్ర ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్‌కు అందచేశారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో తలమునకలైన నాయకులంతా మన రాష్ట్ర కాంగ్రెస్ పరిస్దితులు, తీరు తెన్నులు , చేపట్టవలసిన కార్యక్రమాలను రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే నిర్ణయం చేస్తామని తేల్చారు. దీనిలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కళంకితులైన మంత్రులందరికీ ఉద్యాసన చెప్పాలనుకుంటున్నారు. వీరిలో గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్షయ్య , ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి మోపిదేవి తదితరులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి రాష్ట్ర సర్కారు పరిస్థితి గుంభనంగా ఉన్నప్పటికీ త్వరలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని నాయకులంతా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సీమాంద్ర సీనియర్ నాయకులు వేరు వేరుగా ఢల్లీి నేతలను కలసి తమ తమ వాదనలు వినిపించారు. తెలంగాణ నాయకులు తెలంగాణాను ప్రకటిస్తేనే తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ నిలుస్తుందని చెప్పారు. కొందరు సీనియర్లు ముఖ్యమంత్రిని, బొత్స సత్యన్నారాయణను కూడా మార్చాలని, కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపాలన విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా కేంద్రనాయకత్వం రానున్న 2014 ఎన్నికలకు అనుగుణంగా పావులు కదుపుతుందని తెలుస్తుంది.
No comments:
Post a Comment