Sunday, 24 June 2012

తెలంగాణ ప్రజల దృష్టిలో లగడపాటి ఓ జోకర్ : హరీష్‌రావు



Lagadapati Rajagopal, Harishrao Lagadapati Rajagopal, T Congress leaders Lagadapati, Lagadapati telanga కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అతితెలివితేటలు ప్రదర్శిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీస్‌రావు మండి పడ్డారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ పరకాలలో 99 శాతం మంది తెలంగాణానే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజల దృష్టిలో లగడపాటి ఓ జోకర్ అని ఘాటుగా విమర్శించారు. పరకాలలో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలమనే ప్రచారం చేశాయని, దీనిపై లగడపాటి, వాయలార్ రవికి సీడీ లు పంపుతామన్నారు. లగడపాటి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

అసలు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడేందుకు లగడపాటికి లైసెన్సు ఎవరిచ్చారని ప్రశ్నించారు. లగడపాటిని కట్టడి చేయాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కోరారు. తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడే నైతికహక్కు రాజగోపాల్‌కు లేదని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

No comments:

Post a Comment