చెన్నై/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై తమిళనాడులోని హోసూరు కోర్టు చిరంజీవికి ఈ వారెంట్‌ను జారీ చేసింది. 188, 143 సెక్షన్‌ల క్రింద స్థానిక పోలీసులు చిరంజీవిపై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 2వ తేది లోగా కోర్టుకు హాజరు కావాలని ఈ సందర్భంగా కోర్టు చిరంజీవిని ఆదేశించింది.
2011లో తమిళనాడు సాధారణ ఎన్నికలలో చిరంజీవి కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అప్పుడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా హోసూరు నియోజకవర్గంలోనూ ఆయన ప్రచారం చేశారు. అక్కడ కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కోర్టు ఈ రోజు వారెంట్ జారీ చేసింది.
చిరంజీవితో పాటు గోపినాథ్‌కు కూడా కోర్టు నోటీసులు వారెంట్ జారీ చేసింది. చిరంజీవి హోసూరు అభ్యర్థి గోపినాథ్ తరఫున ప్రచారం నిర్వహించారు. చిరంజీవి ఇప్పటికే కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ పలుమార్లు హాజరు కాలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అక్టోబర్ 2న హాజరు కావాలని చిరును, గోపినాథ్‌ను ఆదేశించింది.
గతంలో తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ చిరంజీవి హాజరు కాలేదు. కాగా నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు పైన చిరంజీవి స్పందన ఇంకా తెలియరాలేదు. చిరు పైన బాగళూరు పోలీసు స్టేషన్‌లో తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
No comments:
Post a Comment