Sunday, 24 June 2012

నెరవేరనున్న – నెరవేరని వై.ఎస్. కోరిక


ImageImage
మనది ప్రజాస్వామ్య దేశం. అత్యధిక  ప్రజలు ఎవరికి ఓటేస్తే – ఎవరిని  కోరుకుంటే వారే పాలకులుకావాలి. వారికే ప్రజా సంక్షేమం మీద కమిట్మెంట్ ఉంటుంది. భవిష్యత్తులో మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళి తీరాలి – వారిని  ఓట్లు అభ్యర్దించి తీరాలి అన్న భయం-భక్తి – జవాబుదారితనం వారిలోనే  ఉంటుంది. లక్కి ప్రైజులా పదువులు  కొట్టేసిన వారికి, కుర్చీ మీద కర్చీఫ్ లాగా పడున్న వారికి  ఏముంటుంది?  కిరణ్, మన్మోహన్  వంటి వారు ఈ కోవకు చెందినవారు.
ఆంథ్ర రాష్ఠ్ర్ర  రాజకీయ చరిత్రలో ప్రజలతో మమేకమై -వారి నమ్మకాన్ని పొంది ముఖ్యమంత్రి అయిన వారు ఇద్దరే . వారు ఎన్.టి.ఆర్, వై.ఎస్. ఆర్.
 వై.ఎస్. ఆర్ కి ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులకున్న తేడా ఇదే. 2003 న వై.ఎస్. చేపట్టిన పాద యాత్ర ప్రజల్లో అతనికున్న విశ్వసనీయతను పెంచింది. చంద్రబాబు హై టెక్కు హంగులతో -దివాళా కోరు విదానాలతో  విసిగి వేసారిన ప్రజల్లో సరి కొత్త ఆశలను రేకెత్తించింది. వారి నమ్మకాన్ని చొరగొంది.
2004 ఎన్నికల అనంతరం  కాంగ్రెస్ వై.ఎస్ ను .ముఖ్యమంత్రి చేసింది. చేసిందనే అనుకుందాం. వై.ఎస్ కు పూర్వం ఎంత మందిని  ఆ పార్టి సి.ఎం కుర్చి ఎక్కిచ్చిందో వారు పార్టికి ఏం ఒరగ పెట్టారో అందరికి తెలిసిన విషయమే. కాని వై.ఎస్. ప్రతి సం.న్ని ఎన్నికల సం.గానే భావించి శ్రమించారు.  ప్రజలు తన పట్ల ఉంచిన నమ్మకాన్ని వొమ్ము చెయ్యలేదు.
నా బోటి కరడు కట్టిన ఎన్.టి.ఆర్ అభిమానులను సైతం – ఆకట్టుకో కలిగారు. ఎన్.టి.ఆర్ పంథాలో -ఇంకా నిజాయితీగా చెప్పాలంటే – ఎన్.టి.ఆర్ కన్నా పది రెట్లు ఎక్కువగానే మానవీయ కోణంలో పరిపాలన అందించారు. ఎన్.టి.ఆర్ హయాంలో ఉన్న పరిమిత వనరులు ఎన్.టి.ఆర్ చేతులను కట్టివేయకుంటే సరిగ్గా వై.ఎస్ ఆర్ అమలు చేసిన ప్రతి పథకాన్ని ఎన్.టి.ఆర్ అమలు చేసి ఉండేవారు.
ఒక విదంగా చెప్పాలంటే వై.ఎస్.ఆర్ పథకాలను ఎన్.టి.ఆర్ పథకాలకు కొనసాగింపుగానే చెప్పాలి. ర్ండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించడంతో ఎన్.టి.ఆర్ అసలు సిసలైన రాజకీయవారసుడ్ని తనేనని వై.ఎస్.ఆర్ చెపప్కనే చెప్పారు.
ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ నడుమ ఉన్న తేడాలు  రెండే. ఎన్.టి.ఆర్ రాష్ఠ్ర్ర పార్టి అధ్యక్షుడు. వై.ఎస్.ఆర్ జాతీయ పార్టికి చెందిన ముఖ్యమంత్రి. ఎన్.టి.ఆర్ ఒక యాక్టర్ – వై.ఎస్.ఆర్ ఒక డాక్టర్.
వై.ఎస్.ఆర్ దిల్లి టూర్లో ఉండగా తెలుగు పాత్రికేయులు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తే వై.ఎస్.ఆర్ ముసి ముసిగా నవ్వుతూ ” అవి మీరడగ కూడదు -నేను చెప్పకూడదు” అనేవారుట.
వై.ఎస్.ఆర్ స్వయాన తాను  ఎన్.టి.ఆర్ అభిమానిని అని చెప్పుకున్న మాట ఎందరికి తెలుసు?
మరి మీ మీద ఎన్.టి.ఆర్ ప్రభావం ఉందా అని ప్రశ్నిస్తే ” ఆయనది( ఎన్.టి.ఆర్) ఎవరినన్నా ప్రభావితం చేయగల అధ్బుత వ్యక్తిత్వం” అని సమాదానం వై.ఎస్.  ఇచ్చిన సమాదానం ఎంతమందికి తెలుసు?
తాను ఎంత సాధించినప్పటికి ఒక జాతీయ పార్టి సి.ఎమ్మే కదా అన్న “భావం” ఆయన మనసులో ఏ కోశానో ఉండి ఉండవచ్చు.
తన నెరవేరని కోరికను జగన్ రూఫంలో నెరవేర్చుకో పోతున్నారు వై.ఎస్.

2 comments:

  1. Ntr ki oka factionist ki polika pettina neevu ntr abhimanive kaadu,janalanu free ga edi icheevarunte vaare goppavallu avutunnaru,panicheyyamante alugutaaru andaru..

    ReplyDelete
    Replies
    1. dude iam not ntr fan iam proud to say iam huge fan of YSR and he s not a factionist because iam from his dist just come out and ask the people he is god for some people

      Delete