Thursday, 23 August 2012

బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.... వార్తల్లో మోక్షజ్ఞ


Mokshagna Early in Bad News
ఇటీవలే తన తండ్రి శ్రీమన్నారాయణ ఆడియో వేడుకలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిన బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవలే వీకెండ్‌ పార్టీ చేసుకుని వస్తుండగా బంజారాహిల్స్‌ రోడ్‌నెం.12లో పోలీసులు పట్టుకున్నారు. ఓ ఆంగ్ల దినపత్రిక మాత్రమే దీన్ని కవర్‌ చేసింది. 

ఎస్‌ఐ బాలకృష్ణా రెడ్డి వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి విధి నిర్వహణలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్నవారిని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా.. ఎ.పి.16 బి.కె.. బండిని డ్రైవ్‌ చేస్తున్న వెంకట్‌ను పట్టుకున్నారు. దీంతో విషయం తెలిసిన స్నేహితులు మరో కారును ఏర్పాటు చేశారు. 

డ్రైవర్‌ పరిమితిని మించి ఆల్కహాలు తీసుకున్నాడని గుర్తించారు. ఇదిలా ఉండగా, ఇంకా నూనూగు మీసాలు రాని మోక్షజ్ఞ ఇటువంటి సంఘటన ద్వారా బయటపడటం అభిమానులను నిరుత్సాహపరుస్తోంది.

No comments:

Post a Comment