Thursday, 30 August 2012

వై‘ఎస్’ అన్నారని మీరు నో అంటారా...

    వై‘ఎస్’ అన్నారని మీరు నో అంటారా...
   వై‘ఎస్’ అన్నారని ఇప్పుడు నో అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. ఆయన ఎస్ అన్నందుకు లభించిన అధికారాన్ని కూడా నో అని దిగిపోయుంటే ఏమనేవారు కాదు.అందుకే ఇప్పుడు విద్యార్థిలోకం విరుచుకు పడుతోంది.            రెండోసారి అధికారంలోకి రావాలంటే సాధారణ విషయం కాదు.దాని కోసం కష్టమైనా కొన్ని పనులు చేయాలి. అందులో భాగమే ఫీజు రీఎంబర్స్ మెంట్. ఇప్పుడది భారమని దానిని తప్పించుకోవాలని చూసింది ప్రభుత్వం. అది అంత ఈజి కాదని తేలిపోయింది.మొత్తానికే కాదంటే ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలన్ని భగ్గుమన్నాయి. ఏమయింది తలవంచి వారి కోర్కెలను ఒప్పుకోవాల్సి వచ్చింది.        
    అంతటితో ఆగారా పాలకులు,వైఎస్ నిరుపేదల కోసం నిర్ణయించిన ఫీజురీఎంబర్స్ మెంట్ ను వారికి దక్కకుండా చేసేందుకు విధానాలు మార్చారు. డబ్బులున్న యాజమాన్యాలకు ఒక న్యాయం, ఏమి చేయలేరన్న ధీమాతో నిరుపేదవిధ్యార్థులకు అన్యాయం చేస్తానంటే విధ్యార్థిశక్తి ఊరుకుంటుందా,నిరుపేద గుండెలు మండవా...అందుకే వారికి పూర్తిగా ఫీజులు మాఫి చేయాలంటూ ఆందోలనకు దిగారు. అనచి వేయాలని చూస్తే ఉద్యమాలకు దిగుతారు.             అడిగినంత ఇవ్వకుంటే కళాశాలలు మూసేస్తామంటేనే తలవంచిన ప్రభుత్వం విధ్యార్థి శక్తిని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్టే. అయినా లటుక్కునా దొరికిందని చటుక్కున కుర్చీల్లో కూర్చుంటే సరిపోతుందా...దాని బరువెంత మనం మోసే కెపాసిటి ఎంతో చూసుకోవద్దు. అలా చేస్తే ఇలాగే ఉంటుంది మరి.

No comments:

Post a Comment