Wednesday, 29 August 2012

బలహీనపడుతున్న యూపీఏ....బలపడుతున్న జగన్

 బలహీనపడుతున్న యూపీఏ....బలపడుతున్న జగన్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది. యూపీఏ పరిస్థితి కడుదయనీయంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో యూపీఏ(కాంగ్రెస్) సర్కార్కు కష్టాలు తప్పేట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్రంలోని యూపీఏ సర్కార్కు దేశ వ్యాప్తంగా ఎదురుగాలి వీస్తున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. సేమ్ టైంలో దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతుండగా...రాష్ర్టంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించనున్నట్లు ఇంటియాటుడే, నీల్సన్ చేసిన సర్వేలు చెబుతున్నాయి. రాష్ర్టంలో పార్టీకి పూర్వవైభవం తేవడానికి టీడీపీ నేత చంద్రబాబు ఎన్నో డిక్లరేషన్లు ప్రకటిస్తున్నా, బాబు హవా మాత్రం రాష్ర్టంలో కనిపించలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ రెండు పర్యాయాలు అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కారణం. రాష్ర్టంలో 42స్థానాలకు గానూ 33ప్లస్ 1(ఎంఐఎం)ఎంపీలను ఇచ్చింది. ఇవీ కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావడానికి ఎంతో దోహదం చేశాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఎంపీలను ఇచ్చిన మన రాష్ర్టం వచ్చే రోజుల్లో ఆ పరిస్థితులు లేవనీ సర్వే చెబుతోంది. అయితే, ఇప్పుడు రాష్ర్టంలో గత ఎన్నికల పరిస్థితులు లేవు. దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందనీ ఇండియాటుడే, నీల్సన్ సర్వే చెప్పాయి. ఎన్నికలు జరిగితే యూపీకు 171నుంచి 181 ఎంపీలు, ఎన్డీయకు 195నుంచి 205ఎంపీల సీట్లు రావచ్చనీ ఇండియాటుడే అంచనా వేసింది. రాష్ర్టం విషయానికి వచ్చే సరికి 42స్థానాలను గాను 26సీట్ల వరకు జగన్ పార్టీకి రావచ్చనీ సర్వేలో పేర్కొన్నది. దీన్ని బట్టి రాష్ర్టంలో అతిపెద్ద శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతరించబోతుందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే రాష్ర్టంలోని సీమాంధ్రలో జగన్ హవా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన నెల్లూరు పార్లమెంటు స్థానానికి, 18అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే నెల్లూరు లోక్ సభతో పాటు 15అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ గెలుచుకుంది. ఇదే హవా వచ్చే ఎన్నికల వరకు కొనసాగే పరిస్థితి వుంది.  ఇండియాటుడే సర్వే కూడా అదే చెబుతోంది. జగన్మోహన్ రెడ్డిని నిలువరించడానికి రాష్ర్టంలోని, కేంద్రంలోని సర్కార్ అన్ని విధాలుగా పనిచేస్తోంది. అయినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ రాష్ర్టంలో రోజు రోజుకూ బలపడుతుందనేది ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఇప్పుడు ఇండియాటుడే సర్వే అదే చెబుతోంది. ఇదిలా ఉంటే, దేశంలో జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయాన్ని చవి చూసింది. సాక్షాత్తు సోనియాగాంధీ, రాహూల్ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అంతెందుకు సోనియా, రాహూల్ సొంత నియోజకవర్గాల్లోనూ సమాజ్ వాద్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న పరిస్థితులే దేశ వ్యాప్తంగా ఉండనున్నాయి. యూపీఏ 2వమారు అధికారంలోకి వచ్చాక అనేక కుంభకోణాలు జరిగాయి. నిత్యావసర ధరలు ఆకాశన్నంటాయి. సామాన్య మానవుడి బతుకు దుర్భరంగా మారింది. పెట్రోలు, డీజీల్ ధరలను 30మార్లు పెంచారు. కుంభకోణాలు, మతఘర్షణలు, అల్లర్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను చాలా దెబ్బ తీసింది. అంతే కాకుండా, ఆయా రాష్ర్టాల్లో పటిష్టమైన నాయకత్వం లేకుండా పోయింది. ప్రజల్లో మంచి పేరున్న జగన్ వంటి నాయకులను పార్టీ దూరం చేసుకుంది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలుగా మారాయి. కేంద్రంలోని యూపీఏ సర్కార్ పరిస్థితి రోజు రోజుకూ కడుదయనీంగా మారుతుందనీ సర్వేలు చెప్పడమే కాదు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. మొత్తానికి అందరూ ఊహించినట్లుగానే రాష్ర్టంలో జగన్ పార్టీకే ప్రజల ఆదరాభిమానాలు ఉన్నట్లు లేటెస్టు సర్వేలు కూడా తేల్చాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ఇంకా బలహీనపడుతుందే తప్ప బలపడటం మాత్రం కుదరదు. ఇదిలా ఉంటే, దేశంలోని టాప్ సీఎంలలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి 1వ స్థానంలో రాగా, మన సీఎం కిరణ్ 8వ స్థానంలో నిలిచాడు. ప్రాంతీయ పార్టీలలో జగన్ పార్టీ మొదటి వరసలో వుంది.  

No comments:

Post a Comment