Wednesday, 29 August 2012

ఆనం గారు... ఆరోజు ఏం చేశారు?


 ఆనం గారు... ఆరోజు ఏం చేశారు?
  రాష్ర్ట ఆర్థిక శాఖా మంత్రివర్యులు ఆనం రాంనారాయణరెడ్డి గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏమీ మాట్లాడని ఆనం ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకు పొంతన లేకుండా వుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మంత్రి పదవీని వెలగబెట్టిన ఆనం... ఆనాడు రాజశేఖర్ రెడ్డికి పూర్తిగా మద్దతు పలికారు.ఇప్పుడేమో రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ, ఆమె పుత్రుడు, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ వల్లనే రాష్ర్టంలో దోపిడీ జరిగిందనీ, జగన్ వల్లనే బీసీ మంత్రులు, అధికారులు బలవుతున్నారనీ మాట్లాడుతున్న తీరు కొంత ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.  దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో తనయుడు జగన్ దోపిడీనీ విజయమ్మ ప్రోత్సహించారనీ, ఆమె ప్రోత్సాహంతో జగన్ దోపిడీ చేయడం వల్లనే బలహీన వర్గాల(బీసీ)మంత్రులు, ఐఏఎస్ అధికారులు బలవుతున్నారనీ అనడం ఆనం రాజకీయ నీతిని తేటతెల్లం చేస్తుందన్నవారు లేకపోలేదు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తీసుకుంటున్న నిర్ణయాలు తప్పు అని ఏనాడు ఆనం అన్న దాఖలు లేవు. ఏనాడైనా రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు తప్పని మాట్లాడితే ఇప్పుడు ఆనం మాట్లాడే మాటలకు ఒకింత విలువ ఉండేది. ఆనాడు తప్పుబట్టని ఆనం ఈనాడు వైఎస్ కేబినెట్ నిర్ణయాలు తప్పనీ, వైఎస్ విజయమ్మను తప్పుబడితే ఎవరైనా ఒప్పుకునే వారుంటారనీ ఆనం అనుకోవడం అవివేకమవుతోంది . దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆనం మంత్రిగా ఉన్నారు. ఆనాడు జగన్ కానీ, విజయమ్మ కానీ మంత్రి వర్గంలో లేరు. కనీసం ఆ విషయం తెలియకుండా ఆనం మాట్లాడటం ఏమిటనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రాజకీయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న వారందరూ తప్పుబడుతున్నారు. ఆనం అంటున్నట్టుగా వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చు. ఆరోజున వైఎస్ విజయమ్మ కేబినెట్ నిర్ణయాలపై ఏమైనా జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందా? ఉంటే, ఆరోజు మంత్రిగా ఉన్న ఆనం ఏం చేశాడు? అప్పుడు మాట్లాడని ఆనం ఇప్పుడు మాట్లాడటం ఏమిటి? అనేది కూడా వస్తూంది. రాంనారాయణరెడ్డి సహచరి మంత్రి మోపిదేవి వెంకటరణమను జైలుకు సీబీఐ జైలుకు పంపించినప్పడు ఎందుకు గుర్తుకు రాలేదనీ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ధర్మాన విషయం రాగానే ఇవన్నీ గుర్తుకు రావడం పై కూడ పలు అనుమనాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత రాజశేఖర్ రెడ్డి తప్పులు చేయవచ్చు. మోపిదేవి అరెస్టు అప్పుడు ఆనం మాట్లాడితే ఎవరైనా నిజమేననీ నమ్మేవారు.  కానీ, ధర్మానతో పాటు మరో నలుగురు మంత్రులు కూడా అదే దారిలో పయనిస్తారనీ వార్తలొస్తున్న సందర్భంలో ఆనం మాట్లాడటం కొంత రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ పార్టీని లక్ష్యంగా చేసుకుందనీ, ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారం నుండి దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నాయంటూ ఆనం చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారాయి. ఇదే కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఇప్పటికే చంచల్ గూడ జైలులో ఉన్నారు.  దీనితో టీడీపీతో జగన్ కుమ్మక్కు అయ్యారంటున్న ఆనం వ్యాఖ్యలు కూడా అంత సమర్ధించే విధంగా లేవు. మంత్రులు తమల్ని తాము రక్షించుకోవడానికే ఇతరులపై ఆరోపణలు నెట్టే విధంగా ఉన్నాయే తప్ప మరొకటిగా లేవనీ రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అవుతాయి. ఇప్పటికైనా ఆనం లాంటి సీనియర్ మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదనీ తెలుసుకుంటే బాగుంటుంది. లేదంటే ప్రజల్లో ఎంతో కొంత అభాసుపాలవడం ఖాయం

No comments:

Post a Comment