హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం అందుకున్న ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తండ్రి హర్‌వీర్ సింగ్, కోచ్ గోపిచంద్‌తో నగరానికి చేరుకున్న సైనాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం ద్వారా ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్న సైనా ఆ తర్వాత హైదరబాద్‌కు వచ్చింది.
20 ఏళ్ల సైనా ఆనందంగా చేతులు ఊపుతూ అభిమానులకు సంకేతాలచ్చింది. ఓపెన్ టాప్ బస్‌లో కాంస్య పతక విజేత సైనా ర్యాలీ నిర్వహించారు. ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓపెన్ టాప్ బస్‌లో ఇతర క్రీడాకారులు కూడా ఉన్నారు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో సైనా లక్కీగా మెడల్ విన్నర్‌గా నిలిచింది. ప్రపంచ నెంబర్ టూ జిన్ వాంగ్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలగడంతో సైనాకు కాంస్యం దక్కింది.
బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సైనా రికార్డ్ సృష్టించింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత ఒలింపిక్స్ పతకం అందుకున్న రెండవ మహిళ సైనా కావటం విశేషం. కాగా సైనా విజయోత్సవ ర్యాలీలో అపశ్రుతి దొర్లింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం టైర్ పంక్చర్ అయ్యింది. అయితే వాహనం నెమ్మదిగా వెళ్తుండటంతో ప్రమాదం తప్పింది.
No comments:
Post a Comment