చెన్నై: కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. దాంతోపాటు కాలేయం కూడా పాడైపోయింది. 67 ఏళ్ళ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రస్తుతం చెన్నైలోని గ్లోబల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
విలాస్ రావ్ ఏడాది క్రితం చేసిన చేయించుకున్న హెల్త్‌చెకప్‌లో ఈ విషయం బయటపడింది. దీంతో రెండు..మూడుసార్లు ఆయన విదేశాల్లో చికిత్స చేయించుకున్నారు. ముంబైలోని బ్రీచ్‌క్యాండీ హాస్పిటల్‌లో కూడా విలాస్ రావ్ కు మూడురోజులు డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో ఆయనను చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. విలాస్ రావ్ కు కాలేయమార్పిడికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు, బాలీవుడ్ సినీనటుడు రితేష్ దేశ్‌ముఖ్ తండ్రికి కాలేయదానం చేయడానికి ముందుకొచ్చినట్లు సమాచారం.
|
No comments:
Post a Comment