Wednesday, 29 August 2012

టీడీపీకి వంటేరు గుడ్ బై:జగన్ గూటికి?

టీడీపీకి వంటేరు గుడ్ బై:జగన్ గూటికి?

 టీడీపీకి మరో షాక్ తగలనున్నది. నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పార్టీ వీడనున్నారు. పార్టీని ఎందుకు వీడాల్సి వస్తుందో ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు వంటేరు ఓ లేఖను రాసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేయననీ చెప్పినప్పటికీ తనను బలవంతంగా పోటీ చేయించారనీ, పార్టీ అధినేత ఆదేశాలను పాటించి తాను పోటీ చేసిన సందర్భంలో జిల్లాకు చెందిన నాయకులంతా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారనీ, ఇది తనను ఎంతో బాధ కలిగించందనీ, ఈ పరిస్థితుల్లో తాను పార్టీలో ఉంటే మరింత నష్టపోవల్సి వస్తుందనే పార్టీని వీడాలనుకుంటున్నట్లు వంటేరు ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. 20ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతన్న వంటేరు 1994లో తొలుత కావాలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో గెలిచారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో,తరువాత నెల్లూరు పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లా నాయకత్వంపై ఉన్న అసంత్రుప్తితోనే వంటేరు పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే టీడీపీని వీడుతున్న వంటేరుతో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి(వైఎస్ఆర్ కాంగ్రెస్) భేటీ అయినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ పార్టీలో రావల్సిందిగా వంటేరును మేకపాటి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వంటేరు కూడా జగన్ పార్టీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వంటేరు జగన్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు ప్రచంరా సాగుతోంది. మొత్తానికి ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి వంటేరు పార్టీని వీడటం ఎంతో కొంత నష్టం చేయనుందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు

No comments:

Post a Comment