
కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూల్ జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. క్రిష్ణా జలాల వినినియోగంలో రాయలసీమకు అన్యాయం జరిగిందనీ ఆవేదన వ్యక్తం చేస్తూ తన ఎంపీ పదవీకి రాజీనామా చేశారనీ అంటున్నారు. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జునసాగర్కు నీటిని విడుదల ఎస్పీవై రెడ్డికి ఇష్టం లేదు. డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తే కర్నూల్ జిల్లాకు అన్యాయం జరుగుతుందనేది ఆయన ఆవేదన. క్రిష్ణా జలాలపై ఇప్పటికే తాను తన పార్టీకి చెందిన పలువురు శాసనసభ్యులం సీఎంను కలిసి పరిస్థితి వివరించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందనీ, దీనితో చేసేదేమీ లేక ఎస్పీవై రెడ్డి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజీనామా లేఖను స్పీకర్ మీరాకుమార్ను కలిసి సమర్పించినట్లు తెలుస్తోది. ఇప్పటికే సీమకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ పార్టీకి చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉద్యమాన్ని ప్రారంభించారు. సకల సంపదలున్నా కూడా సీమ ఏమాత్రం అభివ్రుద్ధి చెందడం లేదనీ, సీమను ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటుతోనే సీమ బాగుపడుతుందంటూ బైరెడ్డి రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి పేరిట ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి క్రిష్ణా జలాల పై రాజీనామా చేయడంతో సీమలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది. ఇంకా మునుముందు ఏం జరుగుతుందో తెలియన పరిస్థితి నెలకొంది.
No comments:
Post a Comment