
ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత భారీ ప్రాజెక్టులతోనూ, డిఫరెంట్ అడ్వంచర్స్ తోనూ సినిమాలు తీస్తున్న ఆర్ ఆర్ మూవీమేకర్స్ ప్రొడక్షన్ హౌస్ మరో ప్రయోగానికి సిద్ధం అయ్యింది. దాదాపు వీరుచేస్తున్న అడ్వంచర్స్ అన్నింటిలోనూ డబ్బే ప్రత్యేకత. సాయికుమార్ కుమారుడిని ఒక భారీ బడ్జెట్ సినిమాతో తెరకు పరిచయం చేసినా, మహేశ్ బాబును బిజినెస్ మ్యాన్ గా డీల్ చేసినా, డమరుకం భారీ బడ్జెట్ సినిమాను నెలల తరబడి పెండింగ్ పెడుతూ వచ్చినా…వీరి వ్యవహారాలు అంతుబట్టని రీతిలోనే సాగుతున్నాయి. తాజాగా మొత్తం కొత్తవాళ్లతో ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక సినిమా తీయబోతున్నట్లు ఆర్ ఆర్ మూవీమేకర్స్ ప్రకటించింది. ‘లవ్ లాంగ్వేజ్’ అనే టైటిల్ తో ‘లిపి లేదు’ అనేది ఉపశీర్షిక తో ఒక సినిమా రూపొందిస్తున్నారు వీరు. మరో విశేషం ఏంటంటే ఈసినిమా మూడుభాషల్లో విడుదల కాబోతోంది. దీంతో ఎల్.వాసుదేవా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత వెంకట్ వివరిస్తూ… ‘ అంతా కొత్తవారితో సినిమాలు తీయాలన్న నిర్ణయానికి స్పందన బాగా వచ్చింది. చాలా మంది ఔత్సాహికులు వినిపించిన కథలు విన్నాం. ‘లవ్‌లాంగ్వేజ్’ కథ బాగా నచ్చింది. నావెల్టీ ఉన్న కథాంశమిది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో వెండి తెరకెక్కించనున్నాం. కొత్తవారితో చేసే ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది’ అని అంటున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి స్థాయి విజయాన్నిరుచి చూస్తుందో!
No comments:
Post a Comment