అనుకూలంగా లేకుంటే అమ్ముడుపోయినట్లేనా?
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్కును కలిగిన ఎన్డీటీవీ చేసిన సర్వే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను ఊపిరాడకుండా చేస్తోంది. ఎన్డీటీవీ కంటే ముందుగా సర్వే నిర్వహించిన ఇండియాటుడే చెప్పినట్లుగానే రాష్ర్టంలో వైఎస్ఆర్ జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హవా కొనసాగుతున్నట్లు ఎన్డీటీవీ చెప్పింది. కాంగ్రెస్,టీడీపీ పార్టీల అడ్రస్ గల్లంతయ్యే దిశలో పయనిస్తున్నట్లు ఆ రెండు మీడియా సంస్థలు చేసిన సర్వేలు చెప్పాయి. ఇదీ ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నెతలెవరికీ మింగుడుపడటం లేదు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో రాష్ర్ట ప్రజలు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఏ స్థానం కలిగించారో అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఇండియాటుడే, ఎన్డీటీవీ కొత్తగా చెప్పింది కూడా ఏమీ లేదు. ప్రజలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతల మాటల్ని నమ్మడం లేదు. కొత్తదనాన్ని, కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదే ఉప ఎన్నికల్లో నిరూపితమైంది. అయితే, టీడీపీ నేతలందరికీ సర్వేలు మాత్రం మింగుడుపడటం లేదు. దానికి అనేక కారణాలు లేకపోలేదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాతనే ‘మీడియా మేనేజ్’ అనే కొత్త పదాన్ని కనుగొన్నారు. చంద్రబాబు దొంగచాటుగా సీఎంగా అయ్యిందే ‘ఈనాడు’ మీడియా సంస్థతో. ఇది జగమెరిగిన సత్యం. గతంలో రాష్ర్టంలోని, దేశంలోని పలు మీడియా సంస్థల యజమానులతో సత్సంబంధాలుండేవి. మీడియాలో తనకు అనుకూలంగా వార్తలు రాయించుకునే వారు. తాను చేయాలనుకున్నది తొలుత తనకు అనుకూలంగా ఉండేటి వంటి మీడియాల ద్వారా ఒకటికి పదిమార్లు రాయించుకునే వారు. తరువాత అమలు చేసేవారు. అదేమంటే, యావత్ మీడియా కోరుకుంటుందనీ, దానితోనే తాము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామనీ చెప్పేవారు. దీనికి నిదర్శనమే సారాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం. ఇలా చెప్పుకుంటే పోతే చంద్రబాబు లీలలు అనేకం ఉన్నాయి. వీటన్నింటిని అటుంచితే...ఇండియాటుడే, ఎన్డీటీవీ మీడియా సంస్థలు ఓ ప్రాంతానికి, వర్గానికి సంబంధించినవి కావు. వాటికంటూ కొన్ని విలువలు ఉన్నాయి. సమాజంలో పేరున్న మీడియా సంస్థలు. తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నట్టుగా అవి అమ్ముడు పోవాలనుకుంటే అధికార పార్టీకి అమ్ముడుపోతాయి. అధికార పార్టీలకు అనుకూలంగా సర్వేలు చేసి ఉండేవి. అలా జరగలేదు. ఇండియాటుడే, ఎన్డీటీవీ వంటి మీడియా సంస్థలు అమ్ముడుపోయానడంకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదు. తమకు అనుకూలంగా ఉంటే మంచివనీ, లేకుంటే అమ్ముడుపోయారంటూ ఆరోపణలు చేయడంతో ప్రజల్లో అంతో ఇంతో ఉన్న విశ్వసనీయతను తెలుగుదేశం పార్టీ పోగొట్టుకుంటుందే తప్ప మరొకటి కాదు.
No comments:
Post a Comment