Tuesday, 28 August 2012

‘వియ్యంకుడి’ విషయంలో చిరంజీవి విజయం!

 
మొత్తానికి తనకు కేంద్రమంత్రి పదవి కాకపోయినా, తన వియ్యంకుడిని టీటీడీ పాలకమండలి సభ్యుడిని చేసి స్థాయి చాటుకొన్నాడు కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి. ఈ రాష్ట్ర వాసి కాకపోయినా, ఒకరికి మించి తమిళనాడు వాసులకు టీటీడీ పదవులు ఇచ్చే ఆచారం లేకపోయినా, ఆ నియమాలను బ్రేక్ చేయిస్తూ, చిరంజీవి తన వియ్యంకుడికి టీటీడీ స్థానం కల్పించగలిగాడు. ఊహించనిరీతిలో జరిగిన ఈ పరిణామం కొందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే, మరికొందరిలో అసంతృప్తికి కారణం అవుతోంది. ఇలా మొత్తానికి తిరుమల-తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చిరంజీవి తన వియ్యంకుడు శివప్రసాద్‌కు చోటు కల్పించుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. చిరంజీవి చాలా సైలెంట్ గా పనికానిచ్చుకొన్నాడు అని కొంత మంది అభిప్రాయపడుతుంటే…ఆ పాలకమండలి సభ్యుడి పదవే కదా అంటూ కొంతమంది తేల్చేస్తున్నారు. అయితే కొంతమంది ‘ప్రజారాజ్యం’ నాయకుల్లో ఈ విషయం అసంతృప్తి రగులుస్తోంది. మొదట మంత్రి పదవుల విషయంలో తన కులం వాళ్లనే చూసుకొన్న చిరంజీవి, ఇప్పుడు కుటుంబ స్థాయికి దిగిపోయాడని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ప్రజారాజ్యం పార్టీ ప్రకటనకు ముందు నుంచి చిరంజీవి వెంట నడిచి కోట్లు ఖర్చు పెట్టుకున్న వారు అనేక మంది ఉండగా, వారిని పట్టించుకోకుండా నమ్ముకున్న వారిని నట్టేటముంచి బంధుప్రీతి చాటుకున్నారని ఆ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ఆయన దృష్టిలో తామంత కాని వారమయ్యామా? అని మధనపడుతున్నారు. ఇలా ఇంకా చిరంజీవి తనపై నమ్మకం పెట్టుకొన్న కొంతమందిని కూడా ఉసూరుమనిపిం చారు.

No comments:

Post a Comment